- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాత్ర కాదు..మనీనే మ్యాటర్..రమ్యకృష్ణ తీరు?

నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాదున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించనుండగా … సినిమాలో కీలకమైన లేడీ విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది చర్చ. హిందీలో ఈ పాత్రను టబు చేయగా… తానే ఈ పాత్ర తెలుగులోనూ పోషిస్తుంది అని టాక్ వచ్చింది. ఆ తర్వాత రంగస్థలం లో రంగమ్మత్తగా మెప్పించిన హాట్ యాంకర్ అనసూయ అయితే క్యారెక్టర్ కు కరెక్ట్ గా సరిపోతుందని… తానే ఫిక్స్ అయిందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మరొకరి పేరు తెరమీదకి వచ్చింది. బాహుబలిలో రాజమాత శివగామిగా కరుణ చూపిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో విలన్ పాత్రకు సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంలో మూవీ యూనిట్ ఉందని సమాచారం. నరసింహ మూవీలో నీలాంబరిగా విలనిజం ప్రదర్శించిన రమ్యనే … మరోసారి విలన్ గా చూపించాలని కోరుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఈ పాత్ర గురించి ఆమెను సంప్రదించగా… క్యారెక్టర్ ఓకే చేసినా.. రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేసిందని సమాచారం. KGF చాప్టర్ 2 కోసం కూడా రమ్యకృష్ణని సంప్రదించగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో… ఆ పాత్ర కాస్తా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కు దక్కింది. దీంతో రమ్య అనవసరంగా తొందరపడి… పవర్ ఫుల్ క్యారెక్టర్ చేజార్చుకుంది అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయిందని అంటున్నారు. కాగా ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది.
Tags: Ramyakrishna, Andhadun, Remake Nithin