- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు సినిమాలో చెర్రీ నక్సలైట్
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ కలయికలో సినిమా అంటే అభిమానులు స్టెప్పులేసేస్తారు. తండ్రీ, తనయులు స్క్రీన్ షేర్ చేసుకుంటారంటే ఆనందంతో పండుగ చేసుకుంటారు. అదే జరగబోతోంది చిరు 152 మూవీతో. చిరు, చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపై చూపించబోతున్నారు దర్శకులు కొరటాల శివ. ఖైదీ నం.150లో చిరుతో కలిసి స్టెప్పులేసిన చెర్రీ సినిమాలో కూడా నటించబోతున్నారంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేనట్లే.
మెగాస్టార్ కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఆచార్య పేరును ఖరారు చేసినట్లు సమాచారం. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ దాదాపు 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. సినిమాలో చెర్రీ నక్సలైట్ క్యారెక్టర్ చేస్తుండగా రంగస్థలంలో చిట్టిబాబు పాత్రను మించిన ఇంటెన్సిటీ ఉంటుందట. త్వరలో రాజమండ్రిలో చరణ్‌పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందట. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌తో మెగా ఫ్యాన్స్ కల నెరవేరుతున్నట్లే.