దుబ్బపల్లి చెక్‌పోస్టులో రామగుండం సీపీ తనిఖీలు

by Sridhar Babu |
దుబ్బపల్లి చెక్‌పోస్టులో రామగుండం సీపీ తనిఖీలు
X

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా సరిహద్దు దుబ్బపల్లి పోలీసు చెక్‌పోస్టును బుధవారం రామగుండం సీపీ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టులో సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్ని అనుమతులు ఉండి, అత్యవసర పని నిమిత్తం వెళ్లే వారిని తప్ప ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అనవసరంగా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. కేసులు కూడా నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ రవీందర్, ట్రైనీ ఐపీఎస్ రూపేశ్ తదితరులు ఉన్నారు.

tag: CP satyanarayana, Sudden Inspection, check post, Ramagundam, peddapalli

Advertisement

Next Story