భారీ మెజార్టీతో గెలిచి వరల్డ్ రికార్డు

by Shamantha N |
భారీ మెజార్టీతో గెలిచి వరల్డ్ రికార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 1969 మొదలు ఇప్పటివరకు వరుస గెలుపులు సాధించిన రాం విలాస్ పాశ్వాన్ రెండుసార్లు మాత్రమే ఓడిపోయారు. 1984లో, ఆ తర్వాత 2009లో ఓటమి పాలయ్యారు. ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుపాలయ్యారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రపంచస్థాయి రికార్డు సృష్టించారు. 1985లో నేషనల్ లోక్‌దళ్ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కొంత కాలానికి జనతా పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఏడాదికే జనతా పార్టీ కూడా జనతా దళ్‌లో భాగం కావడంతో కొత్త పార్టీకి మళ్ళీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2000లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యే అంశంలో జనతా దళ్‌లో చీలిక రావడంతో కొద్దిమందితో కలిసి లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. చివరి వరకూ అందులోనే కొనసాగారు.

Advertisement

Next Story

Most Viewed