రామ్‎చరణ్‌కు కరోనా నెగెటివ్

by Shyam |
Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా రెండు టెస్ట్‌ల్లోనూ కరోనా నెగెటివ్‌ రాగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. చెర్రీ కొవిడ్ ఫ్రీ అని తేలడంతో సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో త్వరలో ‘ఆచార్య’ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు చెర్రీ. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరో కాగా, చరణ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 నుంచే షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. కరోనా పాజిటివ్ రావడంతో కుదరలేదు. ప్రస్తుతం చరణ్ కోలుకోవడంతో హ్యాపీగా ఉన్న డైరెక్టర్.. 30 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా చిరు, చెర్రీల మీద మాసివ్ సాంగ్ షూట్ చేయనున్నారట. కాగా డిసెంబర్ 29న తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించాడు చెర్రీ.

Advertisement

Next Story