- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సీపీ
by Shyam |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: గ్రేటర్ ఫలితాలు వెలువడిన 48గంటల వరకూ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన డీఆర్‌సీ కేంద్రాలను బుధవారం పరిశీలించిన సీపీ మాట్లాడుతూ అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ను సీజింగ్ చేసే సమయంలో వీడియో చిత్రీకరించినట్టు తెలిపారు. పోలీసుల ఎస్కార్ట్ సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తీసుకెళ్తారని అన్నారు. ఓల్డ్ మలక్‌పేట గురువారం రీపోలింగ్ జరుగుతుందని, ఆ డివిజన్‌లో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామన్నారు.
Next Story