- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటల్లో చెప్పలేనంటున్న ‘రకుల్‌ప్రీత్’
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్‌ప్రీత్ సింగ్.. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్న ఈ అమ్మడు.. తన క్యూట్, హాట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటూ క్వారంటైన్ టైమ్‌ను జాలీగా గడుపుతోంది. మరో పక్క లాక్‌డౌన్‌లో పేదల కష్టాలకు చలించిపోయిన రకుల్.. వారికి తన వంతు సాయాన్నందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ‘పెటా’ను ప్రమోట్ చేసే పనిలో ఉంది రకుల్. ‘ఇండియా తరపున పెటా కార్యకర్తగా తనను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, లాక్‌డౌన్ తర్వాత పెటా క్యాంపెయిన్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవలే తెలియజేసిన రకుల్.. తన ఫాలోయింగ్‌ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇన్‌స్టాలో రకుల్ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరడంతో ఈ బ్యూటీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో తనను ఫాలో అవుతున్న వారందరికీ రకుల్ థ్యాంక్స్ చెప్పింది. ‘మాటల్లో చెప్పలేని చాలా విషయాలను ఒక ఫొటో ద్వారా చెప్పొచ్చు. నా ఇన్‌స్టా ఫ్యామిలీ 14 మిలియన్లకు చేరినందుకు హ్యాపీగా ఉంది. ఈ హ్యపీనెస్‌లో నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నేను ఆనందంగా ఉన్నపుడు నా ఫీలింగ్స్ ఇలానే ఉంటాయి. మీ అందరికీ లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న మూవీలో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు.