రకుల్ డీగ్లామరస్ రోల్?

by Jakkula Samataha |
రకుల్ డీగ్లామరస్ రోల్?
X

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఇండస్ట్రీలో గ్లామరస్ డాల్‌గా పేరు తెచ్చుకుంది. ఇన్నాళ్లు కేవలం గ్లామర్ పాత్రలపై కాన్సంట్రేట్ చేయడం వల్లే, తనకు ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయాయని చెబుతుంటారు విశ్లేషకులు. ఈ విషయంలో రకుల్ రియలైజ్ అయ్యేసరికే కెరియర్ చేజారిపోయిందని అభిప్రాయపడుతుంటారు. అయితే ఇన్నాళ్లకు ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసింది భామ. తనను తాను నిరూపించుకుని కమ్ బ్యాక్ అయ్యేందుకు ఉపయోగపడే క్యారెక్టర్ పట్టేసింది.

క్రిష్ డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో రకుల్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని టాక్. రైతు కూతురిగా ప్రధాన పాత్రలో నటించనున్న రకుల్.. మేకప్ లేకుండా ఫస్ట్ టైమ్ డీగ్లామరస్ రోల్ చేయబోతుందని సమాచారం. కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండగా.. వికారాబాద్ అటవీ ప్రాంతంలో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించి నవంబర్‌ వరకు చిత్రీకరణ పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నారు క్రిష్. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో పీరియాడికల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed