- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రకుల్‌ప్రీత్ ‘సీడ్ సైక్లింగ్’ ఫాలో అయిపోదాం..
హీరోయిన్లు తమ అందం, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ‘అందంగా ఉంటేనే అవకాశాలు.. ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు’ కాబట్టి తిండి విషయంలో, ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఇక హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్సరైజ్, యోగా, ఫుడ్.. ఏ టైమ్‌లో ఏ పని చేయాలో ఆ పనే చేయాలని చెప్తుంది. ఈ మధ్యే వెజిటేరియన్‌గా మారిపోయిన రకుల్.. కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ‘సాటి జంతువులను బతకనిద్దాం’ అని పిలుపునిచ్చింది. అంతేకాదు శాకాహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుందని చెప్తోంది. ఈ క్రమంలోనే విత్తనాలు ఆరోగ్యానికి ఎంత మంచివో కూడా చెబుతోంది రకుల్.
నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు.. అవిసె, గుమ్మడికాయ గింజల సీడ్ సైక్లింగ్ ద్వారా బహు ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తోంది అమ్మడు. హార్మోన్ల సమతుల్యతను పొందేందుకు ఇది ఉత్తమమైన మార్గం అని సలహా ఇస్తోంది. ముందుగా 14 రోజులు.. నువ్వులు, పొద్దుతిరుగుడు కాంబినేషన్ తీసుకోవాలని చెబుతున్న ఈ పంజాబీ భామ.. 15 నుంచి 30 రోజులు అవిసె, గుమ్మడి గింజలను ఆహారంలోభాగంగా తీసుకుంటే హెల్తీగా తయారవుతామని వెల్లడించింది.
View this post on Instagram
A post shared by Rakul Singh (@rakulpreet) on Jun 12, 2020 at 10:48pm PDT