మరీ ఇంత దిగజారుడా? : రకుల్

by Shyam |
మరీ ఇంత దిగజారుడా? : రకుల్
X

హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ తమిళ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ సినిమాకు కమిట్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో రకుల్ షూటింగ్‌లో పాల్గొనని చెప్పిందని.. అందుకే తనను సినిమా నుంచి తప్పించారని ఓ వెబ్‌సైట్ వార్త రాసింది. దీనిపై కాస్త ఘాటుగానే స్పందించింది రకుల్.

‘మనం ఎప్పుడు బాధ్యతాయుతమైన జర్నలిజం చూడగలం? మీడియా ఎప్పుడు నిజాలను తెలుసుకుని న్యూస్ రాస్తుంది? తమ పేరును పెంచుకునేందుకు కొన్ని మీడియా సంస్థలు పిచ్చి రాతలు రాస్తూ జర్నలిజం విలువలను మరింత దిగజారుస్తున్నాయి’ అంటూ అభిప్రాయపడింది. ‘అయలాన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదని అంటున్నారు కదా.. అసలు చిత్రీకరణ ఎక్కడ జరుగుతుందో ప్లేస్ చెప్పండి’ అని కోరింది. ఎందుకంటే నేను పని చేయడానికి ఆరాటపడుతున్నానని తెలిపింది.

https://twitter.com/Rakulpreet/status/1276486745287098371?s=20

Advertisement

Next Story