కనివిందు చేస్తున్న రాఖీ పుష్పాలు

by  |
కనివిందు చేస్తున్న రాఖీ పుష్పాలు
X

దిశ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని జాన్ విల్సన్ విగ్రహం ప్రక్కనే విరబూసిన రాఖీ పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాకొక్కసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా పుష్పించడం ఈ పుష్పాల ప్రత్యేకతని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. కృష్ణుడు మహాభారతంలో ఇలాంటి పుష్పాలను చేతులకు కట్టుకున్నట్లు నానుడుంది.

గతంతో పని చేసిన పోలీస్ ఉన్నతాధికారులు ఈ రాఖీ పుష్పాల మొక్కలను నాటినట్లు వారు తెలిపారు. పట్నం నుంచి పల్లెటూరికి కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఏటా కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కొండంతా పండగాల జరిగే రాఖీ పౌర్ణమికి అక్కచెల్లెళ్లు మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చి అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేది. ఈ కరోనా వైరస్ పూణ్యామా అని నాటి అనురాగాలు ఆప్యాయతలు కనుమరుగై పోతున్నాయని ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed