కొరియోగ్రాఫ‌ర్‌ రాకేష్ మాస్టర్ పై దాడి చేసిన దుండగులు

by Sumithra |   ( Updated:2021-05-03 22:54:23.0  )
కొరియోగ్రాఫ‌ర్‌ రాకేష్ మాస్టర్ పై దాడి చేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని రాకేష్ మాస్టర్ సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణానగర్‌ ఏ బ్లాక్‌లోని దేవేందర్‌ గౌడ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న తమ ఇంటికి సాయి యాదవ్, ఇమ్రాన్‌ అనే వ్యక్తులతో పాటు మరికొందరు వచ్చి తనను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని, కిటికీలు ధ్వంసం చేస్తూ చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ వ‌ల్ల‌నే ఈ దాడి జరిగిందని రాకేష్ మాస్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడిచేసినవారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story