- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమర్‌నాథ్ ఆలయంలో రాజ్‌నాథ్ ప్రత్యేక పూజలు
దిశ, వెబ్ డెస్క్: మంచు కొండల మధ్య వెలిసన ప్రముఖ పుణ్యక్షేతం అమర్‌నాథ్ అలయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సందర్శించారు. కశ్మీర్, లడఖ్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. రాజ్‌నాథ్ వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే కూడా ఉన్నారు. అనంతరం ఎల్ఓసీకి సమీపంలోని కుప్వారా జిల్లాలో ఒక ఫార్వార్డ్ పోస్ట్‌ను రక్షణ మంత్రి సందర్శించారు. అక్కడి సైనికులతో ముఖాముఖీ నిర్వహించారు.అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాజ్‌నాథ్ ఈ పర్యటన విశేషంగా నిలిచింది.
ఇదిలాఉంటే అమర్‌నాథ్ యాత్రకు ఎలాంటి అవరోధం లేకుండా ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టామని, భద్రతా పరిస్థితి అదుపులోనే ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. జూలై 21న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, దీనికి నాలుగు రోజుల ముందే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రదాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ స్వయం ప్రకటిత కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.