- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అన్నయ్య' కోసం రజినీ ఫోన్
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి దర్బార్ సినిమాతో అలరించిన ఆయన..ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సిరుతాయ్ శివ దర్శకత్వం వహిస్తుండగా..డి.ఇమామ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కుటుంబ విలువలతో కూడిన కథను ఎంచుకున్న డైరెక్టర్..ఈ సినిమాలో రజినీని కుటుంబంలో పెద్దన్నగా చూపించనున్నారట. కీర్తి సురేష్ కూతురు పాత్ర చేస్తుందని ఇప్పటికే కన్‌ఫామ్ అయింది. కానీ రజినీ డబుల్ రోల్ చేస్తున్నారా? లేదా? అనేది మాత్రం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మూవీ యూనిట్..అన్నయ్య టైటిల్‌ను పరిశీలిస్తోందట. కానీ ఈ పేరుతో తెలుగులో చిరంజీవి హిట్ మూవీ ఉంది కాబట్టి..పర్మిషన్ కోసం చిరును సంప్రదించారట. రజినీ స్వయంగా చిరుకు ఫోన్ చేసి అన్నయ్య పేరును వాడేందుకు అనుమతి కోరగా..దీనికి సానుకూలంగా స్పందించారట చిరు.