- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
26న పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి ప్రమాణస్వీకారం
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణీదేవి ఈ నెల 26న ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిచేత ప్రమాణం చేయించనున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే.
వాణీదేవి మొత్తం 1,89,339 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్. రాంచందర్‌రావుపై ఆమె గెలుపొందారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి.
Next Story