- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కర్ణాటక నుంచి మధ్య తమిళనాడు దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర మధ్య కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధిక వర్షాలు కురిసే జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.