ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

by srinivas |
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. వారు చెప్పకముందు నుంచే ఉత్తరాంధ్రాలో గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షం ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు వచ్చింది.

కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో భారీ ఈదురుగాలులకు ఒక సెల్‌టవర్‌ పడిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. గాలివాన కారణంగా వరిచేలు నేలకు ఒరిగిపోయాయి.

అమరావతి, సత్తెనపల్లి, పెదకూరపాడు, మేడికొండూరు, కొల్లిపర, రొంపిచర్ల, బాపట్ల, విజయవాడ రూరల్‌, ఉంగుటూరు, జగ్గయ్యపేటలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచనలు చేసింది. అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున పంట నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

ఇక రాయలసీమలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నెల 30న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అది తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంది. కోస్తాంధ్రలో కూడా పలు చోట్ల పిడుగులుతో కూడిన వర్షం కురిసే కురుస్తోంది.

Tags – Andhra Pradesh, Rain, coastal, Vizag, Weather

Advertisement

Next Story

Most Viewed