‘రాహుల్ ద్రవిడ్ గొప్పతనం అప్పుడే తెలిసింది’

by Shiva |
‘రాహుల్ ద్రవిడ్ గొప్పతనం అప్పుడే తెలిసింది’
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ గురించి అందరూ మంచిగా చెబుతుంటారు. చాలా మంది ఇండియన్ క్రికెటర్లలో జెంటిల్మెన్ అని పిలిపించుకున్నది రాహుల్ ద్రవిడే. తన ఆట ఎంత హుందాగా ఉంటుందో అతడి నడవడిక కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఈ విషయం వెస్టిండీస్ మాజీ బౌలర్ టినో బెస్ట్ మరోసారి చెబుతున్నారు. 2005లో శ్రీలంక వేదికగా జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ ట్రై సిరీస్‌లో ద్రవిడ్ గొప్పతనం తెలిసిందని, ఆ క్షణమే అతనంటే గౌరవం పెరిగిందని ఈ మాజీ విండీస్ పేసర్ గుర్తు చేసుకున్నాడు. తాను ఆ మ్యాచ్‌తోనే తొలిసారి భారత్‌తో ఆడానని అన్నాడు. తన బౌలింగ్‌లో రాహుల్ ద్రవిడ్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం తన దగ్గరకు వచ్చిన ద్రవిడ్, ‘యంగ్‌ మ్యాన్‌ నీ శక్తి సామర్థ్యాలు నచ్చాయి. అలాగే, కొనసాగు. నీ బౌలింగ్‌లో ఫోర్లు కొట్టినంత మాత్రాన అక్కడే ఆగిపోకు’ అని చెప్పాడు. దాంతో ఆయనంటే గౌరవం పెరిగిందని వెల్లడించాడు. అంతేకాకుండా భారత క్రికెటర్లందరూ మంచివాళ్లని, ఎంతో వినయంగా ఉంటారని టినో బెస్ట్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed