- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ మూడు వైఫల్యాలకు హార్వర్డ్ అధ్యయనం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కేంద్ర ప్రభుత్వంపై కరోనా సహా పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ అమలు అంశాలపై విమర్శలు సంధించారు. ఈ మూడు వైఫల్యాలుగానే మిగిలాయని, వీటిపై భవిష్యత్‌లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీలుగా అధ్యయనం చేస్తుందని ట్వీట్ చేశారు. దీనితోపాటు ఓ వీడియోనూ పోస్టు చేశారు. అందులో ఒకవైపు గ్రాఫ్ పెరుగుతున్న కరోనా కేసులను చూపించగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రసంగాల క్లిప్‌లున్నాయి. మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది గానీ, కరోనాపై పోరు 21రోజుల్లో పూర్తిచేస్తామని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికితోడు కరోనా వారియర్స్ కోసం చప్పట్లు, వంటసామగ్రిని మోగించడం, అలాగే, కరోనా కాలంలో సంఘీభావ ప్రకటనగా లైట్లు వెలిగించే ప్రధాని అభ్యర్థనలను కరోనాపై పోరాటంగా వ్యంగ్యంగా చిత్రించారు.
Future HBS case studies on failure:
1. Covid19.
2. Demonetisation.
3. GST implementation. pic.twitter.com/fkzJ3BlLH4— Rahul Gandhi (@RahulGandhi) July 6, 2020