అవ్వా తాతలకు న్యాయం చేయండి : రఘురామకృష్ణం రాజు

by srinivas |
అవ్వా తాతలకు న్యాయం చేయండి : రఘురామకృష్ణం రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం ఏపీ సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. గత కొంత కాలంగా అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణం రాజు సమస్యలను జోడిస్తూ వరుసగా సీఎంకు లేఖలు రాస్తున్నారు. రోజుకో అంశంపై లేఖ రాస్తూ..టీటీడీ భూముల అమ్మకంపై తన వైఖరి సరైనదేనని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఏపీలో వృద్ధాప్య పెన్షన్ల అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తూ.. పెన్షన్ దారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఈ పథకం 2019 జూలై నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని ఆరోపించారు. దాని కారణంగా అవ్వా తాతలు 7 నెలల కాలానికి గానూ రూ.15,750 నష్టపోయారని వివరించారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించి నష్టపోయిన మొత్తాన్ని లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రతి ఏడాదీ పెంచుతామని చెప్పిన రూ.250 పెన్షన్ కానుకను వైఎస్సార్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed