జగన్‌కు నేను మరో లేఖ రాశా.. 3 ఆవులు చనిపోయాయి

by Anukaran |
జగన్‌కు నేను మరో లేఖ రాశా.. 3 ఆవులు చనిపోయాయి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోలేఖ రాశారు. గోశాలల గురించి లేఖలో ప్రస్తావించారు. ఆయనేమన్నారంటే.. ‘రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ సీఎంగా ఉన్న 2005లో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమీటీలు వేయలేదు. ఆర్ధిక ఇబ్బందులు వలనే గత ఏడాది సింహాచలం పుణ్యక్షేత్రంలో మూడు ఆవులు చనిపోయాయి. విజయవాడ సమీపంలోని తాడేపల్లి-కొత్తూరు గోశాలలో వంద ఆవులు విషప్రయోగం వలన చనిపోయాయి. ఆవులు, దూడలు సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. అన్నివర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలి’అని లేఖలో కోరారు.

Advertisement

Next Story