- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏ సెక్షన్ ప్రకారం సోదాలు చేశారో చెప్పాలి
దిశ ప్రతినిధి, మెదక్: తన ఇంట్లో, తన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు ఎలా చేశారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. రఘునందన్ రావు, అతని బందువుల ఇళ్లలో పోలీసులు సోమవారం సోదాలను నిర్వహించారు. పోలీసుల దాడుల విషయం తెలసుకున్న రఘునందన్ రావు.. ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి.. వెంటనే సిద్ధిపేట చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. కనీసం తన భార్యతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని పోలీసులను ఆయన ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టార్గెట్ చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే పోలీసులతో టీఆర్‌ఎస్ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఇంటిముందు కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. తన ఇంట్లో కి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.