పార్టీ వేరు.. ప్రభుత్వం వేరని చెబుతున్నా : RRR

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ, ఏపీ బ్యూరో: ఆరంభం నుంచి పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని పదే పదే చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ తానెప్పుడూ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ చాలా క్రమశిక్షణతో, పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. తాను తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాలకు గురించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని, అది కూడా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు. అంతే తప్ప తానెప్పుడు పార్టీని విమర్శించలేదని, మీడియానే తమ సంసారంలో నిప్పులు పోస్తోందని, ఇకపై మీడియా అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ మరో 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగాలన్న అభిప్రాయంతోనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామకృష్ణంరాజు స్పష్టంచేశారు.

Advertisement

Next Story