ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో నదాల్

by Shyam |
Rafael-nadal
X

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ గెలుపొందాండు. రికార్డు స్థాయిలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ 3 రఫెల్ నదాల్‌కు క్వార్టర్ ఫైనల్‌లో 10వ సీడ్ డియాగో ష్క్వాజ్‌మాన్ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. తొలి సెట్‌ గెలిచిన నదాల్.. రెండో సెట్లో మాత్రం సర్వీస్ కోల్పోయాడు. దీంతో ఒక బ్రేక్ పాయింట్ సాధించి సర్వీస్ నిలబెట్టుకున్న ష్క్వాజ్‌మాన్ సెట్ గెలిచాడు.

అయితే మూడో సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచిన నదాల్… నాలుగో సెట్‌లో అయితే ష్క్వాజ్‌మాన్‌కు అసలు ఒక్క పాయింట్ కూడా దక్కనివ్వలేదు. దీంతో నదాల్ 6-3, 4-6, 6-4, 6-0 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరుకున్నాడు. ఈ ఏడాది నదాల్ తొలి సారి ష్క్వాజ్‌మాన్ మీదనే సెట్ కోల్పోయాడు. సెమీస్‌లో జకోవిచ్ లేదా బెర్రిటినిలో ఒకరితో నదాల్ తలపడతాడు. ఇక మరో సెమీస్‌లో 5వ సీజ్ సిట్సిపాస్ 6-3, 7-6(7/3), 7-5 తేడాతో 2వ సీడ్ డానిల్ మెద్వెదేవ్‌పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. రెండో సెట్‌లో మెద్వెదేవ్ ప్రతిఘటించినా సిట్సిపాస్ అతడికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ విజయంతో తొలి సారిగా ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి సిట్సిపాస్ అడుగుపెట్టాడు. సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగ ష్వామ్‌టెక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రీస్‌కు చెందిన 17 వ సీడ్ మారియా సక్కారిపై 4-6, 4-6 తేడాతో ఓడిపోయింది. దీంతో మారియా సక్కారి తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో 24వ సీడ్ కోకా గాఫ్‌ను 7-6 (8/6), 6-3 తేడాతో బార్బోరా క్రెజికోవా ఓడించింది. ఈమె కూడా సెమీస్ చేరడం ఇదే తొలిసారి. గురువారం జరిగే మహిళల సింగిల్స్ సెమీస్‌లో 31వ సీజ్ ప్లవిచెంకోవాతో తమార జిదాన్‌సెక్, బార్బోరా క్రెజికోవాతో మారియా సక్కారి తలపడనున్నారు. వీరి నలుగురిలో ఎవరు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచినా అది చరిత్రే అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed