- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరచేతిలోనే అన్ని రేడియో స్టేషన్లు!
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిందన్న మాటను అక్షరాల నిజం చేసే ఒక వెబ్‌సైట్ ఉంది. దాని పేరు రేడియో గార్డెన్. పేరు వినగానే ఇదేదో పాత రేడియోలన్నీ ఒక చోట పేర్చి చూపించే గార్డెన్ అని తప్పుపట్టకండి. ఎందుకంటే ఒక్కసారి ఈ వెబ్‌సైట్‌కు అలవాటయ్యారంటే ఇక గంటల తరబడి అందులోనే ఉండాలనిపిస్తుంది. అలాగని ఇదేదో రేడియో ఆధారిత సోషల్ మీడియా అని కూడా అనుకోవద్దు. అన్ని రేడియోల లాగానే ఇందులో కూడా పాటలు, మాటలు, ప్రకటనలు వస్తాయి. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఉన్న రేడియోలను ఈ ఒక్క వెబ్‌సైట్ ద్వారా వినవచ్చు. అవును.. ఇప్పుడు అర్థమైందా అరచేతిలోనే అన్ని రేడియోలు అని ఎందుకు అన్నామో!
ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి radio.garden అని అడ్రస్ బార్‌లో టైప్ చేయండి. అంతే.. గూగుల్ ఎర్త్‌లో కనిపించినట్లుగా భూగోళం కనిపిస్తుంది. దాని మీద ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న కొన్ని చుక్కలు ఉంటాయి. ఆ చుక్కల మీద క్లిక్ చేస్తే ఆ ప్రదేశంలో ఆన్‌లైన్‌కు అనుసంధానమై ఉన్న రేడియోలను ఉచితంగా వినొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఆడియో స్ట్రీమింగ్ చేసే టెక్నాలజీ ఆధారంగా ఈ వెబ్‌సైట్ పని చేస్తుంది. అంటే ముందుగా ఆన్‌లైన్ ద్వారా రేడియోను ప్రసారం చేస్తున్న వారికి ఈ రేడియో గార్డెన్ ఒక సర్వర్ మాదిరిగా పనిచేస్తుందన్న మాట.
నెదర్లాండ్‌కు చెందిన జోనాథన్ పుక్కీ ఈ రేడియో గార్డెన్ వ్యవస్థాపకుడు. రేడియో ప్రసారాలు చేసే వారిని, వినే వారిని ఒక్కటి చేసేందుకు ఒక మాధ్యమం కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ రేడియో గార్డెన్‌ను 2016లో ప్రారంభించారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే 2 మిలియన్ల మంది వెబ్‌సైట్‌ను సందర్శించారు. అంతేకాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తమ రేడియోలను వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. అలా ఒక్కొక్కటిగా చేరుతూ ప్రస్తుతం ఇందులో లక్షకు పైగా ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లు ఉన్నాయి. చైనాలో కొన్ని రేడియో స్టేషన్‌లు మినహా ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి ఇందులో ఆన్‌లైన్ రేడియోలు ఉన్నాయి. అంటే.. ఒక్క క్లిక్ దూరంలో ప్రపంచంలోని అన్ని రేడియోలు ఉన్నాయన్నమాట. నెదర్లాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌండ్ అండ్ విజన్ వారు ఈ రేడియో నిర్వహణకు నిధులు సమకూరుస్తున్నారు. ఇందులో మన తెలుగు రేడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి లుక్కేయండి!