ఆ విషయంలో తప్పు చేశా: రాధికా ఆప్టే

by Shyam |
ఆ విషయంలో తప్పు చేశా: రాధికా ఆప్టే
X

దిశ, వెబ్ డెస్క్: ఓటీటీ క్వీన్ రాధికా ఆప్టే సినిమాలు, సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, స్టన్నింగ్ క్యారెక్టర్‌లతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే బ్యూటీ..లాక్ డౌన్‌లో సినిమాల ఎంపిక విషయంలో రియలైజ్ అయ్యాను అని.. ఇప్పుడు అదే విషయాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నానని అంటోంది.

తాజాగా ఓ నేషనల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ..దాదాపు పదినెలలు లండన్‌లోనే ఉంది. భర్తతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసింది. ఈ సమయంలో తనకు సంబంధించిన విషయంలో రియలైజ్ అయ్యాను అని.. తప్పకుండా చేంజ్ చేసుకోవాల్సి ఉందని తెలిపింది. తను చాలా సార్లు ప్రాజెక్ట్ మిస్ అవుతుందనే భయంతో, ఇన్‌సెక్యూరిటీతో కొన్ని సినిమాలు చేస్తానని.. ఇష్టంతో కావాలని మాత్రం ఒప్పుకోనని తెలిపింది. అలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయితే ఓకే..అయినా కాకపోయినా సంతృప్తి మాత్రం ఉండదని తెలిపింది రాధిక. అందుకే ఫ్యూచర్‌లో నచ్చిన స్టోరీస్‌కు మాత్రమే ఓకే చెప్తాను అని.. నచ్చకపోతే కచ్చితంగా నో చెప్పాలని నిర్ణయించుకున్నాను అని చెప్తోంది.

ఇతరులను చూసి బిజీగా ఉన్నారని లేదా వాళ్లు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా అని మనం స్ట్రెస్‌లో పడకూడదని డిసైడ్ అయ్యాను అని అంటోంది రాధికా ఆప్టే. కాగా, రాధిక ఫిబ్రవరిలో ‘అండర్ కవర్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతుండగా..ఆపిల్ టీవీ శాంతారామ్ సిరీస్ కూడా లైన్‌లో పెట్టింది. ఇది కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Advertisement

Next Story