- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీళ్లు పెట్టుకున్న కన్నడ హీరోయిన్.. కారణం?
దిశ, సినిమా: శాండల్‌వుడ్ డ్రగ్స్ మాఫియా కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్టయిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో తనను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయగా.. అప్పటి నుంచి జైలులో గడిపిన రాగిణి, గత నెలలో బెయిల్‌పై బయటకు వచ్చింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.
కొందరు తనపై, తన కుటుంబంపై చీప్ అండ్ అబ్యూసివ్ కామెంట్లు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ కుటుంబ సభ్యులపై ఎవరైనా అలాంటి వల్గర్ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండని కోరింది. ప్రజెంట్ తను చాలా క్లిష్ట దశలో ఉన్నానని, తన సమస్య గురించి ఇప్పుడు వివరించలేనని పేర్కొంది. కాలం ప్రతీ గాయాన్ని నయం చేస్తుందని నమ్ముతానని తెలిపిన రాగిణి.. కొంతకాలం తర్వాత ఈ కేసు గురించి తీరికగా మాట్లాడతానని చెప్పింది. కష్టకాలంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని, అద్భుతమైన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తనకున్నాయని తెలిపింది. ఇక 2021లో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నాన్న ఈ హీరోయిన్.. Tears of Joys with love (ప్రేమతో ఆనందభాష్పాలు) #ragini divedi #love #home.. అని ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.