- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేనా.. నారాయణమూర్తి ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, సామాజిక వేత్త ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా గతకొన్ని రోజులుగా తనపై వస్తోన్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరి వాతావరణం గడపటం ఇష్టం కాబట్టే సిటీకి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. ఆటో ఖర్చులకు నెలకు రూ.30 వేల వరకూ ఖర్చు అవుతోంది.. ఆ డబ్బులతో ఇంటి అద్దె కట్టుకోలేనా అని వెల్లడించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు చాలా బాధేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థికసాయం చేస్తామంటే బాధేస్తోందని అభిప్రాయపడ్డారు. తన అవసరాలకు సరిపడా సంపాధించుకున్నాను, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చాను అని అన్నారు. కాగా, ఆర్. నారాయణ మూర్తి దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని, కనీసం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితి ఉన్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.