- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కీలక బౌలర్ ఔట్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నిష్క్రమించాడు. ఆదివారం చెన్నై చేపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు బయోబబుల్ వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైకి చెందిన రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టును వీడి వెళ్లాడని యాజమాన్యం ప్రకటించింది. రవిచంద్రన్ అశ్విన్ కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతుండటంతో వారికి తోడుగా ఉండటానికే ఐపీఎల్ బయోబబుల్ నుంచి బయటకు వెళ్లినట్లు అశ్విన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా, తాను పూర్తి సీజన్‌కు దూరం కాలేదని.. కేవలం చిన్న బ్రేక్ తీసుకున్నానని అశ్విన్ పేర్కొన్నాడు. బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం బయోబబుల్ తిరిగి రావాలంటే వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి.
Advertisement
Next Story