- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విరాళాల సేకరణకు యాదాద్రిలో క్యూఆర్ కోడ్ సేవలు

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా పాలుపంచుకోవాలని సీఎం ఇచ్చిన పిలుపు మేరకు భక్తుల నుంచి విరివిగా విరాళాలు వస్తున్నాయి. మరోవైపు అధికారులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు విరాళాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి భారీ స్పందన వస్తుండడంతో ఇప్పటికే వైటీడీఏ ప్రత్యేక హుండీని ఏర్పాటు చేసింది.
తాజాగా ఆన్‌లైన్ విరాళాల కోసం ఆలయ ఈవో గీతారెడ్డి క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు నగదు జమ చేస్తే నేరుగా వైటీడీఏ అకౌంట్‌లోకి వస్తాయని తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫ్రీ ఛార్జ్, భారత్ పే మొదలుగు సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.