విత్తనాల ప్యాకెట్లపై ఆ కోడ్ తప్పనిసరి

by Shamantha N |
విత్తనాల ప్యాకెట్లపై ఆ కోడ్ తప్పనిసరి
X

దిశ, న్యూస్ బ్యూరో: నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి పత్తి విత్తనాల ప్యాకెట్‌పై బార్‌, క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరిగా ముద్రించాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో కేంద్రం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రతి విత్తన ప్యాకెట్‌పై బార్, క్యూ ఆర్ కోడ్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది. దీని ద్వారా విత్తనాన్ని ఉత్పత్తి చేసిన కంపెనీ, ప్రాంతం, మార్కెటింగ్‌ చేసిన సంస్థ, రిటైలర్‌ డీలర్‌, సాగు చేసిన రైతు.. ఇలా అన్ని వివరాలను తెలుసుకోవచ్చని కేంద్రం వివరించింది. బార్, క్యూఆర్‌ కోడ్‌ ఉన్న విత్తన బ్యాగులు, ప్యాకెట్లు మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా లేబులింగ్‌, లాట్‌నంబర్‌ ఉండాలని, ఈ మేరకు విత్తన చట్టం 1966, 1986 విత్తన రూల్స్‌, విత్తన కంట్రోల్‌ ఆర్డర్‌ 1983 ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed