మొబైల్ వాహ‌నాలతో మరింత సౌలభ్యం

by Sridhar Babu |   ( Updated:2021-06-10 08:24:13.0  )
Minister Puvvada Ajay Kumar inaugurated the mobile ICU buses to Khammam district along with District Collector RV Karnan
X

దిశ‌, ఖ‌మ్మం : కొవిడ్ వైద్య సేవ‌ల‌ను ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు మొబైల్ వాహ‌నాల వైద్యసేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావడం జ‌రిగింద‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. కొవిడ్ బాధితుల‌కు మ‌రింత మెరుగైన వైద్యసేవ‌ల‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన ప‌టిష్ట చ‌ర్యల‌తో పాటు వీరాస్మార్ట్ హెల్త్‌కేర్ స‌హ‌కారంతో హైదరాబాదులో ఇటివ‌లే రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మొబైల్ మెడిక‌ల్ యూనిట్ బ‌స్సుల‌ను జిల్లాల‌కు కేటాయించిన నేప‌థ్యంలో ఖ‌మ్మం జిల్లాకు వ‌చ్చిన మొబైల్ ఐసీయు బ‌స్‌ను జిల్లా కలెక్టర్ ఆర్‌.వీ క‌ర్ణన్ తో క‌ల‌సి రోట‌రీన‌గ‌ర్‌లో గురువారం మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ ప్రారంభించారు.

తొలి విడ‌త రాష్ట్రంలో 30 మొబైల్ ఐసీయూ మెడిక‌ల్ యూనిట్ బ‌స్సుల‌ను ప్రజ‌ల‌కు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు లార్డ్స్ చ‌ర్చి ప్రతినిధులు వెల్లడించారు. మెడిక‌ల్ యూనిట్ బ‌స్సులో వైద్యసేవ‌ల‌తో పాటు ల్యాబ్, డాక్టర్, న‌ర్సింగ్ సిబ్బంది, ఆక్సిజ‌న్ తో కూడిన ప‌ది బెడ్స్ ఏసీ సౌక‌ర్యం అందుబాటులో ఉంటాయ‌ని వారు వివ‌రించారు. మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాకు మొబైల్ మెడిక‌ల్ యూనిట్ బ‌స్సుల‌ను అందించిన లార్డ్స్ చ‌ర్చి భాధ్యుల‌కు, వైద్యసేవ‌లు అందిస్తున్న వీరా హెల్త్‌కేర్ బాధ్యుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

కొవిడ్ వైద్యసేవ‌ల‌లో భాగ‌స్వాముల‌యినందుకు ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని అభినందించారు. బ‌స్సుల‌ను ప్రారంభించిన అనంత‌రం బ‌స్‌లో ఏర్పాటు చేసిన వైద్య స‌దుపాయాల‌ను మంత్రి ప‌రిశీలించారు. ఈ కార్యక్రమంలో న‌గ‌ర మేయ‌ర్ పునుకొల్లు నీర‌జ‌, సూడా చైర్మన్ బ‌చ్చు విజ‌య్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాల‌తి, పాస్టర్ స‌త్యపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed