- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘పుష్ప తగ్గేదెలే’.. ట్రెండ్ అవుతోన్న టీజర్

దిశ, వెబ్‌డెస్క్: తన బర్త్ డే రోజు పుష్ప టీజర్ విడుదల చేయడం ఎంతో ప్రత్యేకమైనదని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అన్నాడు. ది ఫస్ట్ మీట్‌లో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి టీజర్ విడుదల చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప తగ్గేదెలే’ అంటూ అభిమానులను అలరించాడు. ఈ ఒక్క డైలాగ్ మాత్రమే టీజర్‌లో చూపించడం విశేషం. కాగా, ఎర్రచందనం కూలీగా అల్లు అర్జున్ తొలిసారి ఊర మాస్ పాత్ర చేయబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా దర్శకుడు సుకుమార్ అల్లుఅర్జున్‌ను మాస్ యాంగిల్‌లోకి దించేశాడు. ఇక ఈ సినిమాకు కథనాయికగా రష్మిక మందన నటిస్తోంది. డీఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సుకుమార్ తనతో డైరెక్షన్ చేసిన తొలి సినిమా ‘ఆర్య’తోనే స్టైలీష్ స్టార్ అని పేరొచ్చిందని.. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇదే సినిమాతో మరో ఐకానిక్ ఇచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. స్టైలీష్ స్టార్ కాస్తా ఇక మీదట ఐకానిక్ స్టార్ అయ్యాడంటూ అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశాడు.