పంజాబ్ విజయ లక్ష్యం -165

by Shyam |
పంజాబ్ విజయ లక్ష్యం -165
X

దిశ, వెబ్‌డెస్క్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు కనబరిచింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే నీషమ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన పృథ్వీ షా 7(11) మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో తొలి స్టాటజిక్ సమయానికి ఢిల్లీ 52-1(6) స్కోరు సాధించింది.

మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి త్వరగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ, అశ్విన్ బౌలింగ్‌లో అయ్యర్ 14(12) భారీ షాట్‌కు యత్నించగా వికెట్ కీపర్ రాహుల్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ 14(20) మాక్స్ వెల్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే, శిఖర్ ధావన్ మాత్రం ఆట ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన గబ్బర్ మాత్రం పంజాబ్ బౌలర్లపై తన విశ్వరూపం చూపించాడు. దూకుడుగా ఆడుతూ మరోసారి శిఖర్ సెంచరీ 106(61) నమోదు చేశాడు. ఆ తర్వాత స్టోనిస్ 9(10), హెట్ మయర్ 10(6) త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 164 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు :

Delhi Capitals Innings :

పృథ్వీ షా 7(11) c మాక్స్ వెల్ b నీషమ్, శ్రేయస్ అయ్యర్ 14(12) c రాహుల్(wk) b అశ్విన్, రిషబ్ పంత్ 14(20) c మయాంక్ అగర్వాల్ b మాక్స్‌వెల్, స్టోనిస్ 9(10) c మయాంక్ అగర్వాల్ b షమి, హెట్‌మేయర్ 10(6) బౌల్డ్ b షమి

ఎక్స్‌ట్రాలు : 4 – మొత్తం స్కోరు : 164/5

వికెట్ల పతనం: 25-1 (పృథ్వీ షా , 3.2), 73-2 (శ్రేయాస్ అయ్యర్, 8.3), 106-3 (రిషబ్ పంత్, 13.4), 141-4 (స్టోనిస్- 17.3), 164-5( హెట్ మేయర్, (19.6)

బౌలింగ్ : మాక్స్‌వెల్ 4-0-31-1, మహమ్మద్ షమి4-0-28-2, అర్షదీప్ సింగ్ 3-0-30-0, జేమ్స్ నీషమ్ 2-0-17-1, మురుగున్ అశ్విన్ 4-0-33-1, రవి బిష్ణోయ్ 3-0-24-0

Advertisement

Next Story