డెత్ ఓవర్లలో భయపెట్టగలిగాం : రాహుల్

by Anukaran |
డెత్ ఓవర్లలో భయపెట్టగలిగాం : రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్‌ ఎలెవన్ పంజాయ్ ఘోర పరాభవం పాలైంది. ఈ మ్యాచ్‌ అనంతరం పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘మేం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోయాము. భారీ స్కోర్ ఛేదించే క్రమంలో త్వరగా వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై ఒత్తిడి ఉంటుంది. మయాంక్ అగర్వాల్ రన్ అవుట్ చాలా దురదృష్టకరం. పూరన్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఇక డెత్ ఓవర్లలో బౌలింగ్ మెరుగుపడింది. పటిష్టంగా ఉన్న హైదరాబాద్ జట్టును డెత్ ఓవర్లలో భయపెట్టగలిగాం. బిష్ణోయ్, అర్షదీప్ బౌలింగ్ పటిష్టంగా ఉంది.’ అని రాహుల్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story