చీరకట్టులో పుష్-అప్స్, పుల్-అప్స్‌.. వీడియో వైరల్

by Shyam |
dr sharvari inamdar
X

దిశ, ఫీచర్స్ : తరతరాలుగా విదేశీయులను ఆ‘కట్టు’కుంటున్న భారతీయ సంప్రదాయం ‘చీర కట్టు’. వస్త్ర ప్రపంచంలో ఎన్ని ఫ్యాషన్ వేర్స్, వెస్ట్రన్ దుస్తులు వచ్చినా కనికట్టు మాత్రం ‘చీర’దే. ఆరు గజాల చీరలోనే మగువకు నిండుదనం. అందుకే ఎన్ని జనరేషన్స్ మారినా సారీదే టాప్ పొజిషన్. అయితే చీర కట్టులో అన్ని పనులు చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని తెలుసు. కానీ కొంతమంది మహిళలు చీరకట్టుకునే ప్లిప్స్, రన్నింగ్, డ్యాన్స్, హులాహుప్ వంటివి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సారీ ఎప్పటికీ బ్యారియర్’ కాదని చెబుతూ, చీరకట్టులో పుషప్స్, ఎక్సర్‌సైజ్ చేస్తోంది డాక్టర్ శర్వరి ఇనామ్‌దార్. చీర ధరించి జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్ చేస్తున్న ఈ పూణే డాక్టర్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పుణేకు చెందిన డాక్టర్ శర్వరీ ఇనామ్‌దార్ ఐదేళ్ల నుంచి కఠినమైన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను అనుసరిస్తోంది. పుష్-అప్స్, పుల్-అప్స్‌తో పాటు వెయిట్ ట్రైనింగ్‌లోనూ ప్రావీణ్యం సంపాదించిన శర్వరీ ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ రాణిస్తోంది. చీర ధరించడాన్ని ఎంతో ఇష్టపడే ఆమె, చీర ధరించి వ్యాయామాలు చేస్తూ ‘ట్రెడిషనల్ వర్క్‌వుట్’కు కొత్త అర్థాన్ని చెబుతోంది. ఆమె వర్క్‌వుట్స్ వీడియోలు తాజాగా ఇంటర్నె్‌ట్‌లో వైరల్‌గా మారాయి.

‘స్పష్టంగా చెప్పాలంటే, మహిళలు ప్రతిరోజూ చీరలు ధరించరు. అందరికీ చీర ధరించడం అంత కంఫర్ట్‌బుల్‌గా ఉండకపోవచ్చు. కానీ పండగల రోజు మాత్రం భారతీయ మహిళగా, సంప్రదాయ దుస్తుల్లోనే జరుపుకుంటాం. కాబట్టి, చీర ధరించడం ఏ ఇంటి మహిళకైనా ఓ అవరోధంగా ఉండదు. అందుకే చీరలో నేను ఉమన్‌హుడ్(స్త్రీత్వాన్ని)‌ను జరుపుకుంటున్నాను. ఇందులో భాగంగానే వర్క్‌వుట్స్ చేశాను. ప్రతి మహిళ తప్పకుండా యోగా, ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ చేస్తూనే వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి. దీనివల్ల బోన్ డెన్సిటి(ఎముక సాంద్రత) మజిల్ మాస్(కండర ద్రవ్యరాశి) పెరుగుతుంది.

అంతేకాదు యవ్వనంగా కూడా ఉంటాం. వెయిట్ ట్రైనింగ్ తీసుకున్న సమయంలో సరిగ్గా తినడంతో పాటు, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. బలంగా, మానసికంగా, శారీరకంగా మానసికంగా దృఢంగా మారతారు. అప్పుడు మన బాధ్యతలను మరింత బెటర్ వేలో నిర్వర్తించవచ్చు. ఇంకో విషయం చాలామంది బరువులతో వ్యాయామం చేయడం వల్ల బాడీబిల్డర్ లాగా కనిపిస్తారని అపోహ పడుతుంటారు అది తప్పు. ఇది మనల్ని బలహీనతల నుంచి దూరం చేసి, అన్ని విధాలా బలంగా మారుస్తుంది. వ్యాయామం చేయడానికి నా భర్త నన్ను చాలా ప్రేరేపించాడు. నా ప్రయాణంలో నా కుటుంబం ఎంతో సహకరించింది. కుటుంబం సాయం ఉన్నప్పుడే, ఒక స్త్రీ ఏదైనా చేయగలదు’.
– డాక్టర్ శర్వరీ, ఫిట్‌నెస్ కోచ్

Advertisement

Next Story