పుణె వ్యక్తి నిజాయితీకి.. అమెజాన్ అమేజింగ్ గిఫ్ట్

by Shyam |   ( Updated:2020-06-12 03:40:30.0  )
పుణె వ్యక్తి నిజాయితీకి.. అమెజాన్ అమేజింగ్ గిఫ్ట్
X

దిశ, వెబ్ డెస్క్ :
ఈ-కామర్స్ స్టోర్స్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే.. కచ్చితంగా అదే ప్రొడక్ట్ వస్తుందా? లేక వేరేది వస్తుందా? అని చెప్పలేం. చాలా సందర్భాల్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా రాళ్లు, ఇటుకలు, సబ్బులు వంటివి వచ్చిన ఘటనలు అనేకం. అంతేకాక డ్యామేజ్ అయిన వస్తువులు కూడా వస్తుంటాయి. అయితే పుణెకు చెందిన ‘గౌతమ్ రెజె’కు మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.

గౌతమ్.. అమెజాన్‌లో రూ.300 విలువ చేసే ఓ లోషన్ ఆర్డర్ చేస్తే.. అతడికి రూ. 19 వేల విలువ చేసే ఇయర్ బడ్స్ వచ్చాయి. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేదీ లేకున్నా.. అతడు మాత్రం తనకు వచ్చిన ప్రొడక్ట్ గురించి అమెజాన్‌కు వివరించాడు. దాంతో ఆ వ్యక్తి నిజాయితీకి ఫిదా అయిన అమెజాన్.. ఆ ప్రొడక్ట్‌ను అతడికే గిఫ్ట్‌గా ఇచ్చేసింది. ఆ అమేజింగ్ గిఫ్ట్‌కు గౌతమ్ తెగ ఆనందపడిపోతుండగా.. అసలు గౌతమ్‌ ఆర్డర్ చేసిన లోషన్ మాత్రం రాలేదు. అందుకు బదులుగా రెండు కిలోల సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వచ్చాయి. దాంతో లోషన్ కోసం చెల్లించిన రూ. 300ను కూడా గౌతమ్‌ అకౌంట్‌లో తిరిగి క్రెడిట్ చేసింది అమెజాన్. దీనికి సంబంధించిన వివరాలను గౌతమ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరలైంది.

Advertisement

Next Story