కమల్‌తో డేటింగ్‌పై పూజ క్లారిటీ..

by Shyam |
కమల్‌తో డేటింగ్‌పై పూజ క్లారిటీ..
X

హీరోయిన్ పూజా కుమార్.. సీనియర్ హీరో కమల్ హాసన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తమిళ మీడియా కోడై కూసింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కమల్ ఫ్యామిలీ ఫోటోలో తనూ ఉండటం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం-2 లోనూ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావడం, కుటుంబ కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరు కావడం చూస్తుంటే అందరికీ వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. ఉందని అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయాన్నే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజ ముందు ఉంచితే.. అలాంటిదేమీ లేదనే సమాధానం ఇచ్చింది.

‘కమల్ హాసన్‌తో సినిమా చేస్తున్న క్రమంలోనే వారి కుటుంబానికి కూడా దగ్గరయ్యానని.. అందుకే ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు ఆహ్వానం అందుతుంది’ అని చెప్పింది. కమల్ పిల్లలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా తనతో క్లోజ్‌గా మూవ్ అవుతారని తెలిపింది పూజ. కమల్ – శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ -2లో నటిస్తున్న ఈ భామ.. ఆ తరువాతి మూవీ తలైవన్ ఇరుక్కిరన్‌లోనూ కమల్ తనను సెలెక్ట్ చేసుకున్నాడని తెలిసింది. అయితే అవన్నీ పుకార్లేనని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని చెప్తోంది ఈ హీరోయిన్. అంటే ఆ సినిమాలోనూ నటించే అవకాశం లేకపోలేదని ఇండైరెక్ట్‌గా సెలవిస్తోందన్న మాట.

కాగా పూజా కుమారి తెలుగులో రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమాలో నటించింది. ఆమె తెలుగులో నేరుగా నటించిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed