- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడేళ్లలో రూ. 5.49 లక్షల కోట్లను రికవరీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు!
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన ఏడేళ్లలో ప్రభుత్వం రంగ బ్యాంకుల ఎన్‌పీఏలను తగ్గించేందుకు రూ. 5 లక్షల కోట్లకు పైగా రికవరీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు సోమవారం ప్రభుత్వం తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రంలో నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) తగ్గించేందుకు, రికరీని పెంచేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ. 5,49,327 కోట్లను రికవరీ చేయగలిగాయని’ ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అన్నారు.
ఆర్‌బీఐ డేటా ప్రకారం.. 2017-18లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రికవరీ 11.33 శాతం నుంచి 2018-19కి 13.52 శాతం, 2019-20లో 14.69 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో రికవరీ ప్రక్రియ ప్రభావితమైంది. దీంతో 2020-21లో ఎన్‌పీఏలు 12.28 శాతానికి పరిమితమైనట్టు భగవత్ వివరించారు. అలాగే, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల విక్రయం నుంచి బ్యాంకులు రూ. 13,109.17 కోట్లను రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సమావేశాల్లో చెప్పారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి బ్యాంకులు రికవరీ చేయడంపై మాట్లాడిన ఆర్థిక మంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిటర్ల నగదు ఎల్లప్పుడూ సురక్షితమని ఆమె అన్నారు.