- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని యువసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ధర్నా చేశారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజనం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యువసేన నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Next Story