- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దంచికొడుతున్న వానలు.. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

X
దిశ, అశ్వారావుపేట టౌన్ : రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షంతో అశ్వారావుపేట మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటివరకు 18.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
భారీ వర్షం కారణంగా గుమ్మడివల్లి పెదవాగు ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 6.1 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 5.4 మీటర్లకు చేరడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో ఒకటో నెంబరు గేటును ఎత్తి 5,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో దిగువ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Next Story