- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ప్రొఫెసర్లకు ఊహించని షాక్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వారిరువురూ అధ్యాపక వృత్తి నుంచి వచ్చారు. ఇద్దరికీ తలపండిన రాజకీయ అనుభవం ఉంది. వీరిలో ఒకరు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జతకట్టి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. అనంతరం విభేదించి బయటకు వచ్చి పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. మరొకరు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నేత. వీరిరువురూ ప్రొఫెసర్లే. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వేర్వేరు నియోజకగర్గాలలో పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యారు.
ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా? అదేనండి.. ఒకరు ప్రొఫెసర్ కోదండరాం, మరొకరు ప్రొఫెసర్ నాగేశ్వర్. వీరిలో కోదండరాం నల్లగొండ-వరంగల్-ఖమ్మం నుంచి ప్రొఫెసర్ కోదండరామ్, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నుంచి బరిలో నిలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలోకి దిగారు. ఇద్దరూ కూడా లెక్కింపు మొదలైనప్పటి నుంచి చివరి వరకు మూడో స్థానంలో కొనసాగి ఎలిమినేట్ అయ్యారు. ఇద్దరూ ప్రొఫెసర్లు కావడం, ఇద్దరు కూడా మూడో స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేట్ కావడం ఇద్దరికీ ఎన్నికల ఓటమిలోనూ సారూప్యత ఉందని పలువురు చమత్కరిస్తున్నారు.