- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కు ప్రొఫెసర్ గాలివినోద్ కుమార్ సవాల్
దిశ ప్రతినిధి , హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ హెడ్ సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు దమ్ముంటే బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో ప్రవేశపెడుతూ బిల్లును ఆమోదించే విధంగా ఉద్యమం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
.ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బైబిల్, భగవద్గీత.. ఏది మన గ్రంథమని ప్రశ్నించడం తగదన్నారు. భారత ప్రజల గ్రంథం భారత రాజ్యాంగం మాత్రమేనని బైబిలు , భగవద్గీత , ఖురాన్ ఆయా మతాల వ్యక్తిగత గ్రంథాలు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆయా గ్రంథాల కంటే ముఖ్యం భారత రాజ్యాంగమని , దాని ద్వారానే బీసీ కేటగిరికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని అన్నారు. అలాగే బండి సంజయ్ ఎంపీ అయ్యాడని చెప్పారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం భారత రాజ్యాంగ విరుద్ధమని అన్నారు .