ముద్దుతో మ్యూజిక్ వీడియో లాంచ్‌ను అడ్డుకున్న ప్రియాంక చోప్రా

by Jakkula Samataha |
ముద్దుతో మ్యూజిక్ వీడియో లాంచ్‌ను అడ్డుకున్న ప్రియాంక చోప్రా
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్, మల్టీ టాలెంటెడ్ ప్రియాంక చోప్రాపై భర్త నిక్ జోనస్ ఎప్పుడూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా తన లైఫ్‌కు, న్యూ మ్యూజిక్ వీడియో(స్పేస్ మన్)కు కూడా తనే ఇన్‌స్పిరేషన్ అని చెప్పిన నిక్.. లండన్‌లోని తన ఇంట్లోనే వర్చువల్‌గా మ్యూజిక్ వీడియో లాంచ్ చేశాడు. ఈ ఆల్బమ్ ప్రియాంకపై తనకున్న ప్రేమకు నిదర్శనమని చెప్పాడు. కాగా ఈ వీడియోలో ప్రేయసి నుంచి విడిపోయిన ప్రియుడిగా కనిపించిన నిక్.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది చాలా డ్రమాటిక్‌గా చూపించాడు.

https://www.instagram.com/p/CMTCtyQBcmR/?utm_source=ig_web_copy_link

ఐతే ఈ వీడియో లాంచింగ్ సమయంలో ప్రియాంక గురించి చెప్తుండగా.. మధ్యలో ఎంటరైన ఆమె, నిక్‌కు ముద్దుపెట్టి వెళ్ళిపోయింది. ఈ సడెన్ ఇన్సిడెంట్‌తో కాసేపు తడబడిన నిక్, వెంటనే తేరుకుని లాంచింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాడు. కాగా ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

https://www.instagram.com/p/CMTG2mBBMdH/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story