న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. ముందు ఆ పని చేస్తే పంపిస్తా అన్న హీరోయిన్

by Anukaran |   ( Updated:2021-03-31 07:02:40.0  )
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. ముందు ఆ పని చేస్తే పంపిస్తా అన్న హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. అక్కడ ఎక్కువ కాలం నిలబడాలన్నా, ఎక్కువ పేరు సంపాదించుకోవాలన్నా గ్లామర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇక హీరోయిన్ల గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి అభినయంతో పాటు వారి అందం కూడా అవకాశాలను తెచ్చి పెడుతుంది. కొన్నిసార్లు ఆ అందమే వారికి చిక్కులను తెచ్చిపెడుతుంది. హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం.. వాటికి నెటిజన్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ విసిగించడం సాధారణమే. న్యూడ్ ఫోటోలు పెట్టండి.. న్యూడ్ గా నటించారా? ఇలాంటి అభ్యంతరకర ప్రశ్నలను అడుగుతూ వేధిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు వాటిని లైట్ తీసుకొంటారు.. మరికొంతమంది వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. తాజాగా అందాల భామ ప్రియమణి కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. దీంతో ఆమె లైట్ తీసుకోకుండా నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి శభాష్ అనిపించుకుంది.

ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లో ప్రియమణి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. బ్లాక్ చీరలో మెరిసిపోతూ నల్ల కలువను తలపిస్తుంది. ఈ ఫొటోస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం న్యూడ్ ఇమేజ్ అప్లోడ్ చేయ్ అంటూ కామెంట్ పెట్టాడు.. దీనికి సమాధానంగా ప్రియమణి “ముందు మీ అమ్మని, అక్కని అడిగి వారి న్యూడ్ ఫొటోస్ ని పోస్ట్ చేయ్.. ఆ తర్వాత నా న్యూడ్ ఫొటోస్ పంపిస్తాను” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో వెంటనే ఆ నెటిజన్ సారీ మేడం అంటూ తలొంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story