- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ న్యూస్.. షారుఖ్ పక్కన చాన్స్ కొట్టేసిన ప్రియమణి
దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో మూవీ రాబోతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. ఈరోజు పూణెలో షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో మరో సౌత్ హీరోయిన్ ప్రియమణి ఇంపార్టెంట్ రోల్‌కు ఎంపికైనట్లు తెలుస్తోంది. చివరగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో కనిపించిన తను.. ఇదే షెడ్యూల్‌లో షూటింగ్‌లో పాల్గొంటుందని సమాచారం. ప్రియమణి ఇదివరకే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూవీలో షారుఖ్‌తో కలిసి నటించినప్పటికీ అది గెస్ట్ అప్పియరెన్స్ కావడం విశేషం. కాగా సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి స్టారింగ్‌తో రానున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌లో నార్త్, సౌత్‌కు చెందిన మరికొంతమంది యాక్టర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీపికతో షారుఖ్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీ షూటింగ్ కూడా చివరిదశకు చేరుకోగా.. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు షారుఖ్.