తొలిసారి అలా జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ

by Anukaran |   ( Updated:2021-08-14 22:05:53.0  )
modi flag hosting
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఉదయం 7 గంటల 30 నిముషాలకు ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి ప్రధాని నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు వచ్చిన ప్రధానమంత్రికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవవందనం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం నేపధ్యంలో ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎంట్రీ దగ్గర షిప్పింగ్ కంటైనర్లు నిలిపివుంచారు. 350 సీసీ కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట దగ్గర 5 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రత్యేక భద్రతా చర్యలు చేప్టటారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు ఈసారి ప్రధాని మోడీ బుల్లెట్​ ప్రూఫ్​ గ్లాస్​, రక్షణ లేకుండా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బుల్లెట్​ ప్రూఫ్​ రక్షణను సిబ్బంది సూచించినా.. ప్రధాని పక్కన పెట్టారు. దీంతో తొలిసారి బుల్లెట్​ ప్రూఫ్​ రక్షణ లేకుండా ప్రధాని జెండావందనం చేశారు.

Advertisement

Next Story