వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

by Shamantha N |   ( Updated:2020-12-25 10:23:02.0  )
వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
X

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి 96వ జయంతి సందర్భంగా శుక్రవారం నివాళులర్పించారు. ‘సదైవ్ అటల్’కు అటల్ స్మృతి వనానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, పియూష్ గోయల్‌లూ శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో భారత్ అద్వితీయ అభివృద్ధిని సాధించిందని, పటిష్ట భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరకాలం నిలిచిపోతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story