- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ పరీక్షకు సర్వం సిద్ధం
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 13 న దేశ వ్యాప్తంగా నిర్వహించే, నీట్(నేషనల్ ఎలిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్ కోడ్ విధించింది. ఈ నేపథ్యంలో శనివారం ఎన్‌టీఏ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సాధారణ దుస్తులను మాత్రమే ధరించాలని, బూట్లు కాకుండా చెప్పులు వేసుకోవాలని, బురఖా ధరించే ముస్లిం యువతులు నిర్దేశించిన సమయం కంటే ముందే రావాలని, తనిఖీలు చేసిన తర్వాతనే పరీక్ష హాలులోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు.
అంతేగాకుండా హాఫ్ సీల్ లెస్ దుస్తులు ధరించి, అడ్మిట్ కార్డు, వ్యాలిడ్ ప్రూఫ్ తీసుకొని, గంటన్నర ముందే పరీక్ష సెంటర్‌కు చేరుకోవాలని సూచనలు జారీ చేశారు. తెలంగాణ నుంచి ఈ ఏడాది నీట్ రాసే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఈసారి 55, 800 మంది విద్యార్ధులు పరీక్షను రాయబోతున్నారు. గత ఏడాది 54,073 మంది విద్యార్ధులు పరీక్షను రాశారు. అలాగే గత ఏడాది రాష్ట్రంలో నీట్ పరీక్ష కేంద్రాలు కేవలం 79 ఉండగా, ఈసారి వాటిని 112కు పెంచారు. హైదారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా కట్టడి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలుండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.