ఒమిక్రాన్‌పై సమరం.. కేబినెట్ సబ్ కమిటీ సిద్ధం

by Shyam |
Omicron
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి మండలి చర్చించగా.. ముఖ్యంగా ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి ఆరోగ్య శాఖ అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతిపై చర్చించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున పేషెంట్లకు మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించింది. ఇప్పటికే కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల చేసింది.

అయితే, రాష్ట్రంలో టీకా పక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకునేలా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ సిద్ధమైంది. కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు.

Advertisement

Next Story